‘మహర్షి’ టికెట్లపై వీరబాదుడు.. కేజీ చికెన్ వస్తుంది! - MicTv.in - Telugu News
mictv telugu

‘మహర్షి’ టికెట్లపై వీరబాదుడు.. కేజీ చికెన్ వస్తుంది!

May 7, 2019

థియేటర్ల దోపిడీకి రంగం సిద్ధమైంది. మహేశ్ కొత్త సినిమా ‘మహర్షి’ జనం జేబులుకు చిల్లుపెట్టనుంది.  సినిమా కోసం హైదరాబాద్‌ థియేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.80 టికెట్‌ ధరను రూ.110కి పెంచారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 వరకు పెంచి పడేశారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో అయితే రూ.138 పలుకుతున్న టికెట్‌ ధరను ఏకంగా రూ.200కి పెంచారు.

దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. పెంపు దారుణం అని, 200లకు కేజీ చికెన్ తెచ్చుకుని తిందాం గురూ అంటున్నాయి. అయితే అభిమాన హీరో సినిమా కోసం ఎంతయినా ఖర్చు చేస్తాం అని మరికొందరు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పెంచిన ధరలు రెండు వారాలు అమల్లో ఉంటాయి. ఈ సినిమాను రోజు ఐదు షోల చొప్పున ఈ నెల 9 నుంచి మే 22 వరకు ప్రదర్శించనున్నారు. ప్రభుత్వం అనుమతితోనే ధరలు పెంచినట్లు థియేటర్లు చెబుతుండగా, అలాంటిదేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. పెంపుకు ప్రభుత్వం అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. మహేశ్‌ బాబు 25వ సినిమాగా వస్తున్న ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ తదితరులు ఇతర తారాగణం.