సినీ కుటుంబ నేపథ్యంతో చాలా చిన్నవయసులోనే వెండితెరపైకి దూసుకొచ్చిన నరేశ్ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎన్నో మెరుపులు. నిజజీవితంలో ఎన్నో మరకలు. హాస్యం పండించినా పెద్దరికంతో గాంభీర్యం ఒలికించినా ఆయనకే చెల్లింది. భార్యపై మోజు తీరగానే మరొకరి కోసం వల వేస్తాడనే అపవాదూ ఉంది. నటన వేరు, జీవితం వేరు. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడాల్సిన అవసరం లేకపోయినా సెలబ్రిటీలు కావడం, కొన్నిసార్లు కావాలనే అటెన్షన్ కోసం పాకులాడ్డం వల్ల నరేశ్ వంటివాళ్లు నిత్యం వార్తలో నానుతుంటారు. తాజాగా ఆయన నచ్చుటగా నాలుగోసారి పెళ్లాబోతున్నట్లు ప్రకటించారు. నటి పవిత్రా లోకేశ్‌తో ఆయన ప్రేమాయణం, మూడో భార్య రమ్యతో ఘోరమైన గొడవలు అందరికీ తెలిసినవే. మూడు పెళ్లిళ్లు చేసుకుని దాంపత్య జీవితంలో ఇమడలేని నరేశ్ నాలుగోపెళ్లి అయినా నిలుస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయినా వయసులో 20 ఏళ్ల గ్యాప్ ఉన్న ఈ ప్రేమజంటకు అభిమానులు హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నరేశ్ నాలుగో పెళ్లి నేపథ్యంలో గత మూడు పెళ్లిళ్లపై చిన్న ఫోకస్ ఇది..
తొలి పెళ్లి
నరేశ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను పెళ్లాడాడు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. ‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంలో నవీన్ హీరోగా నటించాడు. కానీ యాక్టింగ్ సరిగ్గా రాక, లావై పోవడం వల్ల నిలదొక్కుకోలేకపోయాడు.
రెండో పెళ్లి
తొలి భార్యతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసిన నరేశ్ తర్వాత ప్రఖ్యాత సినీ గేయరచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. పేరు తేజ. అభిప్రాయ భేదాలతో ఇద్దరూ విడిపోయారు. రేఖా సుప్రియ కూడా రచయిత్రి. విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఇప్పటికే స్నేహంగానే ఉంటున్నారు.
మూడో పెళ్లి..
ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యా రఘుపతిని నరేశ్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు యాభై అయినా రమ్య ఇష్టపడి మరీ పెళ్లాడింది. వీరికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్న వీరి మధ్య తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. పవిత్రతో అనుబంధం దీనికి కారణం కావొచ్చనే కథనాలు ఉన్నాయి. నరేశ్, పవిత కొన్నాళ్ల కిందట మైసూరులోని ఓ హోటల్లో ఉండగా రమ్య దాడి చేసింది.
60లలో నాలుగోపెళ్లి
కర్ణాటకకు చెందిన పవిత్రకు నరేశ్‌తో జరగబోతోంది రెండో పెళ్లి. ఈమెకు సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో తొలి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. నరేశ్‌కు ఇప్పుడు 62 ఏళ్లు.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022