డాక్టర్‌తో నిఖిల్ సిద్ధార్థ నిశ్చితార్థం - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్‌తో నిఖిల్ సిద్ధార్థ నిశ్చితార్థం

February 3, 2020

mnjkmv

నటుడు నిఖిల్‌ సిద్దార్థ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిఖిల్ నిశ్చితార్థం డాక్టర్‌ పల్లవి వర్మతో అయింది. ఇరువురు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో తాజాగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిఖిల్‌-పల్లవి కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాల్టీ షో ‘ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌’లో తన ప్రేమ గురించి నిఖిల్‌ మొదటిసారి వెల్లడించాడు. ఆ షోలో నిఖిల్ మాట్లాడుతూ..’నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెషల్‌. తను ఒక డాక్టర్‌. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు కానీ, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు కానీ తను నన్ను విసిగించదు. నా ఫోన్‌ కూడా చెక్‌ చేయదు. ప్రతిఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే విషయాన్ని తను నమ్ముతుంది. అదే నాకు తనలో బాగా నచ్చింది’ అని నిఖిల్‌ తెలిపాడు. వీరి పేళ్ళి ఎప్పుడు ఎక్కడా అనే విషయాలు తెలియాల్సి ఉంది.