టెలిగ్రామ్ యాప్‌ని బ్యాన్ చేయండి...నిఖిల్ మనవి - MicTv.in - Telugu News
mictv telugu

టెలిగ్రామ్ యాప్‌ని బ్యాన్ చేయండి…నిఖిల్ మనవి

December 9, 2019

nikhil siddarth.

యువ నటుడు నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెల్సిందే. దీంతో చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో తిరుగుతూ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు. సక్సెస్ టూర్‌లో భాగంగా గుంటూరుకి వెళ్లిన నిఖిల్‌కి అనూహ్య సంఘటన ఎదురైంది.

గుంటూరులో రోడ్డుపై ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ సీడీని 40 రూపాయలకే అమ్మడాన్ని చూసి నిఖిల్ తట్టుకోలేకపోయాడు. పైరసీ అమ్మే మహిళపై తన ఆవేదన చూపలేక..ప్రేక్షకులకి పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా ఓ అభిమాని నిఖిల్‌కి ట్వీట్ చేస్తూ..పైరసీ సీడీని కనీసం 40 రూపాయలకైనా కొంటున్నారు. కానీ, టెలిగ్రామ్‌ యాప్‌లో ఫ్రీగా పైరసీ లింక్ పోస్ట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ..ప్రభుత్వం ఈ టెలిగ్రామ్ యాప్‌ని బ్యాన్ చేయాలని, ఉగ్రవాదులు కూడా ఈ యాప్‌ని వాడుతున్నారని విజ్ఞప్తి చేశారు.