Tollywood actor prithviraj second marriage with sheetal
mictv telugu

నాకు 57, ఆమెకు 24.. పెళ్లాడేస్తున్నాం.. పృథ్వీరాజ్

October 29, 2022

Tollywood actor prithviraj second marriage with sheetal

‘రుక్కు రుక్కు రుక్కిమిని.. రమణి సుగుణమణి రబ్బా హోయిరబ్బా’ అని పెళ్లి సినిమాలో సందడి చేసిన నటుడు పృథ్వీరాజ్ కొన్నేళ్లు వెండితెరపై కనిపించకపోయినా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేశాడు. రెండో పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆరేళ్ల కిందట మొదటి భార్యతో విడాకులు పుచ్చుకున్న తను తనకంటే వయసులో చాలా చిన్నదైన తెలుగమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన వయసు 57 అని, తన పెళ్లాబోతున్న యువతి వయసు 24 ఏళ్లు అని కాబోయే సహచరి షీతల్‌తో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు.

‘‘నా మొదటి భార్య బీనాతో మనస్పర్ధలు వచ్చాయి. రెండో బిడ్డను కనే విషయంలో గొడవపడి విడిపోయాం. నేను ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నానని పుకార్లు వచ్చాయి. పెళ్లి విషయంలో దాచాల్సిందేముంది? ఒంటరి బతుకు దుర్భరం. షీతల్ పరిచయమయ్యాక ఆ బాధ పోయింది. మేం ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరి ఇళ్లలో ఈ విషయం తెలుసు. మొదట చిన్నమ్మాయి నేను ఒప్పుకోలేదు. తనే చేసుకుంటానంది. ప్రేమకు వయసేమిటి? ఎప్పుడెలా పుడుతుందో తెలియదు.’’ అని చెప్పాడు పృథ్శీరాజ్. బాల్యనటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన దక్షిణాది చిత్రాల్లో పదిహేనేళ్లపాటు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.