నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం

October 22, 2020

issues

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. గతకొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. ‘కరోనా వైరస్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. ఆయన ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు.’ అని శివాత్మిక ట్వీట్‌లో పేర్కొంది. 

కొన్ని రోజుల క్రితం‌ రాజశేఖర్ కుటుంబంలో అందరూ కరోనా బారిన పడ్డారు. రాజశేఖర్, భార్య జీవితా, పిల్లలు శివాని, శివాత్మిక అందరికీ కరోనా సోకింది. వారిలో శివాని, శివాత్మిక ఇటీవల కోలుకున్నారు. ఇక జీవిత, రాజశేఖర్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.