రానా, మిహీకాల నిశ్చితార్థం జరిగిపోయింది.. ఫొటోలు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

రానా, మిహీకాల నిశ్చితార్థం జరిగిపోయింది.. ఫొటోలు ఇవే.. 

May 21, 2020

rana...

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం జరిగిపోయినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని మీడియాలో వార్తలు రావడం, అలాంటిదేమీ లేదని, కేవలం మాట్లాడుకుంటామని రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ వివరణ ఇచ్చారు. సెలబ్రిటీల తతంగం కావడంతో జనానికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. మొత్తానికి లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఇలాంటి శుభకార్యాలకు సెలబ్రిటీలు దూరంగానే ఉంటున్నారు. అంతగా వేచిచూడలేని వాళ్లు గుట్టుగా జరిపించేస్తున్నారు. 

రానా, మిహీకాల ఎంగేజ్మెంట్ కూడా అలాగే కానిచ్చేసినట్లు తెలుస్తోంది. రానా పంచెకట్టులో, మిహీకా పట్టుచీరలో కళకళలాడుతున్న ఫొటోలును  ఈ రోజు బయటికొచ్చాయి. రానానే స్వయంగా పోస్ట్ చేయడంతో అవి నిశ్చితార్థం ఫొటోలనే అని అభిమానులు భావిస్తున్నారు. ఫొటోల్లో శుభకార్యాలకు వాడే లైట్ల తీగలు కూడా కనిపించడం దీనికి ఊతమిస్తోంది.  ఈమాత్రం దానికి అంత హైప్ క్రియేట్ చెయ్యాల్సిన అవసరం లేదని కొందరు నెటిజనం అంటోంది.