టాలీవుడ్లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు చనిపోయిన సంగతి మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన యువ హీరో శ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో మరణించారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇది జరిగింది.
దుర్గా రాంప్రసాద్ 20 రోజుల క్రితం అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ అతనికి పరీక్షలు చేయగా కరోనా అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మరణించాడు. కాగా ఈ రోజుల్లో’ సినిమాతో శ్రీ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘లవ్ సైకిల్’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ లాంటి సినిమాల్లో హీరోగా చేశారు. కాగా గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోని సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.