అర్జున్ ఆరోపణలకు విశ్వక్ సేన్ కౌంటర్.. - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ ఆరోపణలకు విశ్వక్ సేన్ కౌంటర్..

November 5, 2022

సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ నటుడు విశ్వక్ సేన్‌ల మధ్య గొడవ ముదురుతోంది. కాల్షీట్స్ ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టి, సినిమా ఆగిపోయేలా చేసినట్లు అర్జున్ సర్జా తనపై చేసిన ఆరోపణలపై విశ్వక్ స్పందించాడు. తన తన సిబ్బంది ద్వారా వివరాలు వెల్లడించారు. అర్జున్ దర్శకత్వం వహిస్తున్న మూవీ నుంచి విశ్వక్ తప్పుకున్న మాట నిజమేనని అతని సిబ్బంది వెల్లడించారు.

‘‘తప్పుకున్న మాట నిజమే. మూవీ కోసం తీసుకున్న పారితోషికం, చెక్కులు, డాక్యుమెంట్లను నిర్మాతల మండలికి పంపించాను’ అని ఆయన శనివారం రాత్రి వారు తెలిపారు. చిత్రం మరింత బావుండటానికి సంగీతం, మాటలు. పాటలు వంటి వాటిలో విశ్వక్ చిన్న చిన్న మార్పులు సూచించారని, అయితే అర్జున్ అందుకు ఒప్పుకోలేదని వెల్లడించారు. ‘‘ఆయన చెప్పినట్లే పని చేయాలన్నారు. ఆంక్షలు పెట్టారు. విశ్వక్ తన మాటకు గౌరవం లేకపోవడంతో ఆ సినిమా నచ్చక బయటికి వచ్చేశారు.’’ అని తెలిపారు. విశ్వక్ హీరోగా, అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా మూడు నెలల కిందట మొదలైన ఈ మూవీ విభేదాల వల్ల ఆగిపోయింది.