Tollywood actress Rambha injured in car accident Canada Ontario
mictv telugu

నటి రంభ కారుకు యాక్సిడెంట్.. నుజ్జు, గాయాలు..

November 1, 2022

నిన్నటితరం అందాల నటి రంభ ఆస్పత్రి పాలయ్యారు. కారు ప్రమాదంతో గాయపడి కోలుకుంటున్నారు. ప్రమాదంలో తనతోపాటు తమ కుటుంబసభ్యులందరూ గాయపడినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే కూతురు సాషా మాత్రం కాస్త తీవ్రంగా గాయపడ్డంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని తెలిపారు. కారు డోర్ నుజ్జు అయిన ఫోటోలు కూడా పంచుకున్నారు. ‘‘మాకు ఈ రోజు టైమ్ బాలేదు.. స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా మా కారును ప్రమాదవశాత్తూ మరో కారు ఢీకొట్టింది. అందరికీ చిన్నచిన్న గాయాలయ్యాయి. సాషా మాత్రం ఇంకా హాస్పిటల్లోనే ఉంది.

ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించండి’ అని ఆమె పేర్కొంది. అందరూ త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దక్షిణాదిని ఒక ఊపి ఉత్తరాదిలోనూ అడుగుపెట్టిన రంభ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2010లో కెనడాలో సెటిల్ అయిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లాడిన రంభకు ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలోని ఒంటారియోలో ఉంటోంది.