సినీ నటి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రేష్మ రాథోడ్ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఆమెకు ఖమ్మం జిల్లా ‘వైరా’ అసెంబ్లీ టికెట్ ఖరారైంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే ఆమె ప్రజలతో కలివిడిగా ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమపథకాల గురించి ప్రచారం చేస్తోంది. దీంతో ఆమెకు వైరా నుంచి బరిలోకి దించనుంది.ఈ విషయంపై రేష్మ స్పందిస్తూ… ‘పార్టీ ఆదేశిస్తే నేను సిద్దమే. బయ్యారం ఉక్కు కార్మాగారానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ కేసీఆర్ ప్రభుత్వమే సహాకరించలేదు. ఫ్యాక్టరీని మెదక్ తరలించాలని చూస్తోంది. మా ప్రభుత్వం వస్తే, బయ్యారంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తాం. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుత పథకానికి కేంద్రం శ్రీకారం చుడితే, తెలంగాణలో మాత్రం దాన్ని అమలు చేయడానికి నిరాకరించారు. ఇది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే’అని రేష్మ పేర్కొంది.