సమంత పెద్దమనసు.. ఆటో డ్రైవర్‌కు కారు - MicTv.in - Telugu News
mictv telugu

సమంత పెద్దమనసు.. ఆటో డ్రైవర్‌కు కారు

April 23, 2021

Tollywood actress Samantha gifts car to Narayankhed Auto driver kavita rathore

దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత అందచందాలకే కాకుండా సేవాకార్యక్రమాలకు కూడా పెట్టింది పేరు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోడానికి ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. సమంత తాజాగా ఓ కుటుంబాన్ని ఆదుకుని వార్తల్లోకి ఎక్కారు. పొట్టకూటి కోసం ఆటో నడుపుతున్న ఓ మహిళకు కారు కొనిపెట్టారు.

ఆహా యాప్ ద్వారా సమంత నిర్వహించే టాక్ షోలో నారాయణఖేడ్ పట్టణానికి చెందిన కవితా రాథోడ్ అనే మహిళ ఇటీవల పాల్గొంది. ఆమె కష్టాలను విన్న సమంత చలించిపోయింది. తనకు చేతనైన సాయం చేస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుని కారు కొని పంపింది. సమంత ప్రతినిధులు కొత్తను కారును కవితకు అందజేశారు. సమంత సాయంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.