వాణిశ్రీ కొడుకుది గుండెపోటు కాదు, లాక్‌డౌన్ ఆత్మహత్య!
సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంటటేశ్ కార్తీక్ గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా భార్యాపిల్లలకు దూరమైన ఆయన తీవ్ర మానసిక ఆందోళనతో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు తమిళ, కన్నడ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. 36 ఏళ్ల అభినయ్ చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లోనే విగతజీవిగా కనిపించాడు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఆయన ప్రస్తుతం బెంగళూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య కూడా డాక్టరే. లాక్ డౌన్‌కు ముందు ఆయన చెంగల్పట్టులోని ఫామ్ హౌస్‌కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. తండ్రి కరుణాకరన్ తోపాటు అక్కడే ఉంటున్నాడు. రెండు నెలలుగా భార్యాబిడ్డలను చూడలేకపోవడంతో డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. ఆయన మృతదేహాన్ని చెన్నైకి తరలించారు. అయితే అభినవ్ మృతిపై కుటుంబం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.