Tollywood Anchor Varshini may marry his relative
mictv telugu

సినిమా ఆఫర్స్ లేక.. యాంకర్ వర్షిణి షాకింగ్ డెసిషన్

October 3, 2022

Tollywood Anchor Varshini may marry his relative

అతికొద్ది సమయంలో బుల్లితెరలో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న యాంకర్ వర్షిణి సౌందరరాజన్. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో నటించేందుకు తెగ ప్రయత్నిస్తుంది. దానికోసమే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. అయితే తాజాగా ఈ బుల్లితెర భామ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. వర్షిణి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే వర్షిణి పెళ్లాడనుంది మరెవర్నో కాదని.. సొంత బావతోనే మూడోముళ్ళు వేయించుకోనుందట యాంకర్ వర్షిణి.

ఇక టాలీవుడ్లో సరైన సినిమా ఆఫర్స్ లేకపోవడంతోనే వర్షిణి ఈ డెసిషన్ తీసుకుందని అంటున్నారు. చిన్నతనం నుండే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండటంతో.. బావతో వర్షిణికి పెళ్లి చేయాలనీ ఇరువురి కుటుంబ సభ్యులు నిర్ణయించారట. వర్షణి బావ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా.. వారి పేరెంట్స్ కి ఒక్కడే కొడుకు అని తెలుస్తోంది. ఈ నెల చివర్లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి పీటలు ఎక్కేందుకు వీళ్లద్దరు నిర్ణయించుకున్నారట. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.