బీజేపీకి మద్దతుగా.. బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి మద్దతుగా.. బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం

December 1, 2019

tollywood ..

టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సరికొత్త అవతారం ఎత్తారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో డిసెంబర్ 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

 

ఈ క్రమంలో బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షో నిర్వహించారు. బ్రహ్మానందాన్ని చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ బీజీేపీ అభ్యర్థి సుధాకర్‌ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. సుధాకర్ రెడ్డి తనకుమంచి మిత్రుడన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చానన్నారు. పలు తెలుగు సినిమా డైలాగ్స్ వేస్తూ…జనాల్లో ఉత్సాహం నింపారు. ఇదే సమయంలో జేడీఎస్‌ అధినేత దేవెగౌడ కూడా చిక్కబళ్లాపురలో ప్రచారం నిర్వహించడం గమనార్హం.