మృగాళ్లను ఉరితీయండి..సినీ ప్రముఖుల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

మృగాళ్లను ఉరితీయండి..సినీ ప్రముఖుల ఆగ్రహం

November 29, 2019

గురువారం రోజున రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన విషయం విదితమే. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సుధీర్ బాబు, అల్లరి నరేష్, మెహ్రీన్ పీర్జాదా, లావణ్య త్రిపాఠి, చిన్మయి శ్రీపాద, కీర్తి సురేష్ సహా పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున నీరసం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రియాంక అంటూ హాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.

ప్రియాంకను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు నిర్దారించారు. తరువాత దుప్పటిలో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారని తెలిపారు. నలుగురు నిందితులను మహబాబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. వారిలో ఒకరిని మహమ్మద్ పాషాగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి సహాయంతో మిగతా ముగ్గురిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఈకేసుని ఛేదించే అవకాశం ఉంది.