హైదరాబాద్ వరదలు.. సినీతారల భారీ విరాళాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వరదలు.. సినీతారల భారీ విరాళాలు..

October 20, 2020

హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల విరాళాలు ప్రకటించాయి. అలాగే మేఘా కంపెనీ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. 

తాజాగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబులు చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించారు. నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. త్రివిక్రమ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. అనిల్, హరీష్ శంకర్ చెరో రూ. 5లక్షల విరాళం ప్రకటించారు. అలాగే దాతలు అందరు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని కోరుతున్నారు.