ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కమెడియన్ అలీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కమెడియన్ అలీ..

October 27, 2022

సీనియర్ హాస్యనటుడు అలీ రాజ్యసభ సీటుపై పెట్టుకున్న ఆశలు ఆవిరైనా కాసింత ఊరట దక్కింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవి కట్టబెట్టారు. ఈమేరుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలీ రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. ప్రభుత్వానికి అవసరమైన ఎలక్ట్రానిక్ కార్యకలాపాలకు చేయూత అందిస్తారు. జీతం, అలవెన్సులు అన్నీ కలిపి లక్షల్లోనే ఉండనుంది.

ప్రభుత్వానికి డబ్బు తీసుకుని సలహాలిచ్చే మేధావులు ఎక్కువయ్యారని తీవ్ర విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోకుండా కొత్తకొత్త పోస్టులు సృష్టించి ఆప్తులకు కట్టబెడుతున్నారు. రాజమండ్రికి చెందిన అలీ (పూర్తి పేరు మహమూద్ అలీ) కొన్ని నెలల కిందట సీఎంను కలసుకున్నప్పుడు రాజ్యసభకు పంపుతారని, లేకపోతే ఎమ్మెల్సీని చేస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే శుభవార్త వింటారని అలీ కూడా చెప్పారు. తర్వాత ఆ విషయం పక్కకు తప్పుకుంది. అలీని నిరాశపరచకుండా తాజాగా పదవిలోకి తీసుకన్నారు. నిక్కర్ల వయసు నుంచే టాలీవుడ్‌ను దున్నుతున్న అలీ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఇదివరకు వార్తలు రావడం తెలిసిందే.