ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు అలీ కూతురు ఫాతిమా పెళ్లి ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో శుభకార్యం వైభవంగా ముగిసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లిలో తారలు సందడి చేశారు. చిరంజీవి, నాగార్జున, రోజా వంటి తారలెందరో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వధువు ఫాతిమా రెమీజు ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. ఆమె భర్త షేహయాజ్ కూడా డాక్టరే. అలీ, జుబేదా దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. జుబేదా యూట్యూబ్ చానల్ ద్వారా వివిధ అంశాలపై వీడియోలు పోస్ట్ చేస్తో తనకూ ఓ స్టేటస్ సంపాదించుకున్నారు. దాదాపు 45 ఏళ్ల కెరీర్లో వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన అలీని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించింది. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Tollywood comedian Ali daughter marriage celebration
Tollywood , comedian Ali, ali daughter marriage, cine stars, Fathima ali
Boss @KChiruTweets Along With Vadinamma #Surekha Garu Arrived At Actor #Ali 's Daughter Wedding In Hyderabad ❤️😍❤️#WaltairVeerayya #Mega154
@KChiruTweets #Chiranjeevi#MegaStarChiranjeevi #Chiru154 pic.twitter.com/brLu1TDabz
— Mega Family Fans (@MegaFamily_Fans) November 27, 2022