'త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా'..యువ ద‌ర్శ‌కుడు - MicTv.in - Telugu News
mictv telugu

‘త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా’..యువ ద‌ర్శ‌కుడు

August 13, 2020

Tollywood director ajay bhupati tested coronavirus positive

టాలీవుడ్ యువ దర్శకుడు అజయ్ భూపతి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా’ అని అజయ్ ట్వీట్ చేశాడు. దీంతో అతడికి కరోనా సోకిందని నిర్దారణ అయింది. ఆయ‌న కరోనా నుంచి త్వరగా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

అలాగే కరోనాను జయించి వస్తానని చెప్పిన మనో ధైర్యాన్ని అభినందిస్తున్నారు. అజయ్ కరోనా నుంచి కోలుకున్న తరువాత ప్లాస్మా దానం చేస్తానని ముందే చెప్పడానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అజయ్ రూపొందించిన ‘ఆర్ఎక్స్ -100’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ప్ర‌స్తుతం ‘మ‌హా స‌ముద్రం’ అనే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. క‌రోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.