అనుష్కకు అండగా మారుతి.. లేడీ జర్నలిస్ట్ పై ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్కకు అండగా మారుతి.. లేడీ జర్నలిస్ట్ పై ఆగ్రహం

September 15, 2020

maruthii

విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఇటీవల సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. తాజాగా అనుష్క శర్మ ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో అనుష్క తన బేబీ బంప్ చూసి మురిసిపోతూ తల్లి కాబోతున్న ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లి కోహ్లీ లేదా చిన్ని అనుష్క కోసం వేచి చూస్తున్నామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ ఫోటోపై ఓ మహిళా జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ”అంతలా సంతోషపడకు కోహ్లీ మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ కు మహారాణిని కాదు.” అని మీన దాస్ నారాయన్ అనే మహిళ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు మారుతి తనదైన స్టైల్‌లో స్పందించాడు. ”చాలా విచారకరమైన స్పందన. అది కూడా ఓ మహిళా జర్నలిస్ట్ నుంచి… ఓ మహిళ ఇంగ్లండ్ మహారాణి కావడం కన్నా, బిడ్డకు తల్లి కావడమే సంతోషకరం. అనుష్క సెలబ్రిటీ కావడానికన్నా ముందే ఓ యువతి. తల్లి కాబోతున్న క్షణాలను ప్రతి క్షణం ఆహ్వానించే హక్కు ఆమెకు ఉంది” అని ఆ మహిళ జర్నలిస్ట్ ట్వీట్ కి రీట్వీట్ చేశాడు.