శంకర్‌కు అంత తక్కవ రేటుకు ఎందుకిచ్చారు?: తెలంగాణ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

శంకర్‌కు అంత తక్కవ రేటుకు ఎందుకిచ్చారు?: తెలంగాణ హైకోర్టు

August 10, 2020

tollywood Director n shankar land dispute.

తెలంగాణకు చెందిన సినీ దర్శకుడు ఎన్ శంకర్ కు కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం శంకర్‌పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెల్సిందే. దీంతో ఇంత కారు చౌకగా ఒకరికి భూమిని ఎలా కేటాయించారని కరీంనగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిపింది. ఈ విచారణకు దర్శకుడు ఎన్ శంకర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన భూమితో ఏం చేస్తారని కోర్టు శంకర్ ను అడుగగా.. రూ.50 కోట్లతో స్టూడియో నిర్మించి 300 మందికి ఉపాధి కల్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూమి ధర మార్కెట్ లో ఎంత ఉంటుందని హైకోర్టు ప్రశ్నించగా.. రూ.2.50 కోట్లు ఉంటుందని హెచ్‌ఎండీఏ తెలిపింది. 

అంత విలువ చేసే భూమిని ఏ ప్రతిపదికన కారు చౌకగా కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. భూమి కేటాయించడం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే అయినానప్పటికి దానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండడంతో కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు కోరాడు. దీంతో తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.