గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న దర్శకుడు! - MicTv.in - Telugu News
mictv telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న దర్శకుడు!

July 5, 2020

vhm hm

తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్న సంగతి తెల్సిందే. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 

తాజాగా ‘గూఢచారి’ సినిమా నటుడు అడవి శేష్ విసిరిన ఛాలెంజ్ ను దర్శకుడు శశీ స్వీకరించారు. ఈరోజు ఖాజాగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా మంచి ఛాలెంజ్ ను చేపట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్రులు శరత్ చంద్ర, అనురాగ్ మారెడ్డి లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసారు.