దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా

September 16, 2020

gngn

ప్రముఖ తెలుగు ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు కూడా క‌రోనా వైరస్ కోరల్లో చిక్కకున్నారు. కొన్నాళ్లుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నానని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

‘ఈ నెల 23 వరకు ఐసొలేషన్ ఉంటుంది. కరోనా లక్షణాలు ఉన్నా పూర్తి  రోగ్యంగానే ఉన్నాను. త్వరగానే కోలుకుంటాను..’ అని ఆయన చెప్పారు. ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు..  ఆదిత్య 369 సీక్వెల్ తీయబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులోనూ బాలయ్యే హీరోగా నటిస్తాడని చెబుతున్నారు. అయితే దీనిపై అధికార ప్రకటనేదీ రాలేదు. 90 ఏళ్ల వయసున్న శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తారని కూడా అంటున్నారు.