డ్రగ్స్ కేసులో 4 చార్జిషీట్లు.. సినీజీవులందరూ పవిత్రులే! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో 4 చార్జిషీట్లు.. సినీజీవులందరూ పవిత్రులే!

May 14, 2019

రెండేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎందరో సినీ ప్రముఖుల పేర్లు వినిపించిన సంగతి తెలిసందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుని విచారించడానికి అకున్ సబర్వాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కేసు విచారణ నిమిత్తం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల గోర్లు, వెంట్రుకల సమూనాలను సేకరించారు. రెండేళ్లుగా మరుగున పడిన ఈ కేసులో తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాలుగు చార్జీషీట్లు, 12 కేసులను నమోదు చేశారు.

Tollywood drugs case All film personalities let off the hook.

అయితే సిట్ అధికారులు దాఖలు చేసిన చార్జీషీట్లలో 62 మంది నటీనటుల, దర్శకుల పేర్లు మాత్రం కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ ప్రముఖుల పేర్లను సిట్ అధికారులు చార్జిషీట్లలో చేర్చలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దాఖలైన చార్జీషిట్లలో సినీ సెలబ్రెటీలకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జీషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పైన నమోదు చేశారు. రఫెల్ అలెక్స్ విక్టర్ ముంబై నుండి హైదరాబాద్‌కు కొకైన్ తరలించి విక్రయిస్తున్నాడని 2017లో పోలీసులు అరెస్ట్ చేశారు.