వీళ్లు ఏమన్నా..రేప్ బాధితులా..పేర్లు బయటపెట్టకపోవడానికి..? - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లు ఏమన్నా..రేప్ బాధితులా..పేర్లు బయటపెట్టకపోవడానికి..?

July 14, 2017

రాష్ట్రంలో డ్రగ్స్ దొంగలు పడ్డారు. మత్తులో జోగుతూ చిత్తవుతున్నారు.ఇప్పటికి చాలాసార్లు బయటపడినా టాలీవుడ్ షేక్ కాలేదు..ఇప్పుడు దొరికిన డ్రగ్ డంప్ సినీ జనాల్ని ఉ…పోయిస్తోంది. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ మొబైల్‌డాటాతో టాలీవుడ్ డ్రగ్ స్టార్స్ బండారం బయటపడింది. వీళ్లకు ఎక్సైజ్ నోటీసులు ఇచ్చింది..బాగుంది కానీ..మత్తులో జోగుతున్న వారి పేర్లు బయటపెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు..?వీళ్లు ఏమన్నా అత్యాచార బాధితులా పేర్లు బయటపెట్టకపోవడానికి..? డ్రగ్స్ తీసుకుంటూ సభ్య సమాజానికి మత్తు మెస్సేజ్ ఇస్తున్న వీళ్లను ఎందుకు ఉపేక్షించాలి..? పేర్లు బయట పెడితే కేరీర్ నాశమవుతుందని అంటున్నారు. అంటే రాయకూడని, చెప్పకూడని అత్యాచార బాధితుల్ని పేర్లు బయటపెట్టినప్పుడు వాళ్ల భవిష్యత్ నాశనం కాలేదా…అప్పుడు ఏమైంది మీడియా, పోలీసుల సోయి…సినిమావాళ్ల విషయం వచ్చేసరికే ఇది గుర్తు వస్తుందా…?

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఎనిమిదిమంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో యువహీరోలు నవదీప్, తరుణ్, హీరోయిన్లు చార్మి, ముమైత్‌ఖాన్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరాజు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిని వారంలోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హీరో రవి తేజ తో పాటు ఆయన డ్రైవర్ పేరు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు డ్రగ్స్ స్టార్స్ నిజంగా వీళ్లేనా…?వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు.? మత్తులో జోగుతున్న సినీ జనుల్ని వెనకేసురావాల్సిన అవసరం ఏమో ఉందో..?

ఇటీవల డ్రగ్స్ రాకెట్‌లో దొరికిన కొందరు నిందితుల కాల్‌డాటాను పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు విశ్లేషించగా, అనేకమంది పేర్లు బయటకొచ్చాయి. ఇందులో కొందరు పారిశ్రామికవేత్తల పిల్లలు, సినీరంగానికి చెందినవారు ఉన్నట్టు ఆధారాలు లభించాయి. అన్ని ఆధారాలతో గురువారం యువహీరోలు తరుణ్, నవదీప్, హీరోయిన్లు చార్మి, ముమైత్‌ఖాన్, దర్మకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరాజుకు నోటీసులు జారీచేశారు. వీరు వారంలోపు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. వీరికి డ్రగ్స్‌మాఫియాతో నేరుగా సంబంధం ఉందా? వీరిని వాడుకునేందుకు ప్రయత్నించిందా? అన్న కోణంలో విచారణ జరిగే అవకాశం ఉన్నది.

ఒక విషయంలో మాత్రం తెలంగాణ పోలీసులు, ఎక్సైజ్ శాఖ ని మెచ్చుకోవాల్సిందే..డ్రగ్స్ కేసులు ఇంతకుముందు బయటపడినా అంతగా పట్టించుకోలేదు. కానీ నోటీసులు ఇచ్చే దాకా వెళ్లడం సూపర్.. వాళ్ల పేర్లు కూడా బయట పెట్టి జనాల్లో , మీడియా పీపుల్ టెన్షన్ తగ్గించండి పోలీస్ బాస్ లూ.

ఎహె డ్రగ్ అడిక్ట్ పేర్లను దాయాలని ఏ రాజ్యాంగంలో లేదు..బయటపెడితే కొంపలేం అంటుకుపోవు..టాలీవుడ్ అంతా కుప్పకూలిపోదు…అందుకే ఎవరెవరు ఉన్నారో వాళ్ల పేర్లని కన్ ఫామ్ చేయండి…వారి చేత డ్రగ్స్ ఎలా మాన్పించాలో ఆలోచించండి.అంతే గానీ దాచి పెట్టి ఇంకొంతమందిని డ్రగ్స్ కి బానిసల్ని చేయకండి సార్లూ