తెలుగు సినీఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నందమూరి తారకరత్న మరణం మరవక ముందే మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో రిలీజ్ అయిన దర్శకుడు సినిమాకు ప్రవీణ్ అనుమోలు సిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. జక్కాహరి ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అశోక్ బండ్రెడ్డి హీరోగా నటించాడు. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాత. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెగా పనిచేశాడు. చిన్నవయస్సులోనే ప్రవీణ్ గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులంతా తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.
కొన్నాళ్ల క్రితం కే. విశ్వనాథ్, తారక రత్న మరణించిన సంగతి తెలిసిందే. జమున, కృష్ణ, సత్యనారాయణ ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే సినీ ప్రముఖులు వరసగా మరణించారు. తాజాగా ప్రవీణ్ మరణంతో సినీ పరిశ్రమలో విషాధఛాయలు అలముకున్నాయి.