Tollywood film producer Annapareddy Appireddy pays tributes to legendary actor Krishna
mictv telugu

కృష్ణకు నిర్మాత అప్పిరెడ్డి ఘన నివాళి

November 16, 2022

అర్ధ శతాబ్ద కాలం తెలుగు ప్రేక్షకులను అలరించి దివికేగిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు పలువురు ప్రముఖులు అశ్రునయనాలతో నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత, మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి బుధవారం పద్మాలయా స్టూడియోస్‌కు వెళ్లి కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిదని అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘టాలీవుడ్‌లో కృష్ణగారు ట్రెండ్ సెట్టర్.

వైవిధ్య భరితమైన సినిమాలు నిర్మించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు వెండితెరకు స్కోప్, ఈస్ట్‌మన్ కలర్ వంటి ఎన్నో కొత్త సాంకేతిక ఒరవళ్లను పరిచయం చేశారు’’ అని అప్పిరెడ్డి కొనియాడారు. కృష్ణలా సినీ రంగంలో కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా కృష్ణను కడసారి చూడటానికి వేలాదిమంది అభిమానులు పోటెత్తుతున్నారు. ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు కూడా వస్తుండడంతో ఆ ప్రాంతం ఇసకేస్తే రాలనట్లు మారింది. సూపర్ స్టార్ అంత్యక్రియలను సాయంత్రం మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.