ఒక్క ట్వీటైనా చేయండి.. టాలీవుడ్ సెలబ్రిటీలపై రాజశేఖర్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క ట్వీటైనా చేయండి.. టాలీవుడ్ సెలబ్రిటీలపై రాజశేఖర్ ఫైర్

November 13, 2019

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్‌లోని కొంత మంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. కొందరు కనీస మంచీమర్యాదలు కూడా మరచిపోతున్నారని, ఎవరైనా చనిపోతే కనీసం చూడ్డానికి కూడా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. చిన్న చిన్న గాయాలయ్యాయి. నుదుటిపై దెబ్బ తగిలి బ్లీడింగ్ అయ్యింది. నాకేమైందంటూ చాలా మంది ఫోన్లు, మెసేజీలు చేసి అడుగుతున్నారు. పరామర్శించడానికి మా ఇంటికి వస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలిసింది. వారందరి  ప్రేమే నన్ను కాపాడింది. మీ అందరికీ రుణపడి ఉన్నాను. నా కోసం ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించారు. వారికి నమస్కారం.. సినిమాలోని అందరం ఒక కుటుంబంగా ఉన్నాం. అయితే పెద్దలంటే గౌరవం పోతోంది. సినిమా కుటుంబంలో ఎవరైనా చనిపోతే కొందరు కనీసం చూడటానికి కూడా వెళ్లడం లేదు. చనిపోయిన తరువాత అయినా వాళ్ల ఆత్మ  ఘోషిస్తుంది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరైనా చనిపోయినా వెళ్లి పలకరించండి. కనీసం ట్వీట్ అయినా చేయండి. మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. కానీ కొందరు ట్వీట్ కూడా చేయడం లేదు.. ’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.