Tollywood hero Chiranjeevi Godfather movie background political aspirations an analysis
mictv telugu

ఈ గాడ్‌ఫాద‌ర్ గ‌ట్టెక్క‌గ‌ల‌డా? చిరంజీవి స్కెచ్‌పై ఓ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ..

September 29, 2022

AP government will allocate Two acres of land for setting up KrishnamRaju Smritivanam

నాకెందుకో చిరంజీవిలో రాజ‌కీయ‌ చింత చ‌చ్చినా పొలిటిక‌ల్ పులుపు ఇంకా చావ‌లేద‌నిపిస్తోంది.
ఆయ‌న అధికారికంగా రాజ‌కీయాన్ని వ‌దిలేసినా అన‌ధికారికంగా ఆ ఆన‌వాళ్లు అలాగే ఉన్నాయ‌నిపిస్తోంది.
ఇందుకు కార‌ణం నెంబ‌ర్ వ‌న్- ఆయ‌న‌లోని తీవ్ర రాజ‌కీయ‌ అసంతృప్తి.

రెండో రీజ‌న్.. ఎలాగైనా స‌రే జ‌న‌సేన‌కు త‌న తాజా చిత్రరాజం ఒక ఊత‌క‌ర్ర‌లా ప‌నిచేయాల‌న్న త‌ప‌న తాప‌త్ర‌యం వ‌గైరా వ‌గైరా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయ్..
గాడ్‌ఫాద‌ర్ ట్రైల‌ర్ చూస్తే అందులో జ‌న జాగృతి పార్టీ అని ఏదో క‌నిపిస్తుంది.
ఇది ఇంచు మించు జ‌న‌సేన పేరును ప్ర‌తిధ్వ‌నిస్తుంది..

ఇక సినిమాలోని డైలాగుల్లో దివంగ‌త సీఎం పాత్ర పేరు కూడా అచ్చు వైయ‌స్ఆర్‌లా వినిపిస్తుంది.
ఇక ఆ సంభాష‌ణ‌ల్లో సీఎం సీటుపై ఎక్క‌గ‌లిగేంత వ్య‌క్తి అంటూ బాస్‌ను ఎలివేట్ చేస్తూ క‌నిపిస్తారు..
అంతే కాదు సీఎం కేండేట్‌గా యువ స‌త్య‌దేవ్‌ను చూప‌డంలో ఎందుక‌నో జ‌గ‌న్ గుర్తుకొస్తున్నారు.
నా ముందు బ‌చ్చాగాడివి అన్న యాంగిల్లో వేసే కౌంట‌ర్ నేరుగా జ‌గ‌న్‌ను ట‌చ్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.
ఇటు భీమ్లా నాయ‌క్‌లో కొన్ని రెఫ‌రెన్సులు కూడా స‌రిగ్గా ఇలాగే జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తుంటాయ్.
గాడ్‌ఫాద‌ర్‌లో కూడా కొన్ని సీన్లు డైలాగులు.. ఇంచు మించు అలాగే క‌నిపిస్తున్నాయ్..
దానికి తోడు ఆయ‌న ఈ చిత్రంలో కొట్టిన పొలిటిక‌ల్ డైలాగుల్లో మొద‌టిది..
రాజ‌కీయం నుంచి నేను దూర‌మ‌య్యానేమోగానీ రాజ‌కీయం నానుంచి కాద‌న్నది ఒక‌టి అయితే.. రెండోది ప్రీ రిలీజ్‌లో కాంట్రాక్ట‌ర్ల మీద చేసిన కామెంట్లు.. కూడా ఎవ‌రికో హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయ్…

బేసిగ్గా చిరంజీవి కుటుంబంలో చాలానే కులాలుంటాయ్.. అందులో రెడ్డి- క‌మ్మ- కాపు అంటూ చాలానే కుల నిక్షేపాలు దాగి ఉన్నాయ్.. వారిలో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు, బిజినెస్ టైకూన్లు.. ఇత‌ర‌ కాంట్రాక్ట‌ర్లున్నారు.. ఈ రెఫ‌రెన్సుల‌న్నిటినీ ఇప్పుడీ చిత్రంలో మిక్స్ చేయ‌డం ఏం చెబుతోంది? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.
నోటితో కాదంటున్నా నొస‌టితో త‌న రాజ‌కీయ యావ‌కు సంబంధించిన సంకేతాలైతే అన్న‌య్య గ‌త కొంత కాలంగా రిలీజ్ చేస్తూనే ఉన్నారు..
ఆయ‌న మాట‌ల్లో ఈ మ‌ధ్య అసంతృప్తి జ్వాల‌లు ఎగ‌సెగ‌సి ప‌డుతున్నాయ్..
మాములుగగా ఒక వ్య‌క్తిలో ఒక ఓట‌మి.. అసాధ్య‌మైన ప‌ని.. దాని తాలూకూ ఎదురుదెబ్బ వాళ్ల‌కు తెలీకుండా వాళ్ల గుండె లోతుల్లో ఒక ఆందోళ‌న‌గా మారి గూళ్లు క‌ట్టుకుని పేరుకుపోతుంది..

AP government will allocate Two acres of land for setting up KrishnamRaju Smritivanam

స‌రిగ్గా అన్న‌య్య విషయంలో ఇలాంటిదేదో జ‌రిగింద‌న్న మాట వినిపిస్తోంది.
బేసిగ్గా చిరంజీవిది రాజ‌కీయంగా తొంద‌ర‌బాటుత‌నం..

అందులో భాగంగానే ఆయ‌న త‌న పార్టీ ఓట‌మిని అస్స‌లు జీర్ణించుకోలేక‌.. దాన్ని వెంటవెంట‌నే అనాలోచితంగా కాంగ్రెస్‌లో క‌లిపేయ‌డం.. ఆ వెంటవెంట‌నే రాజ‌కీయాల‌ను వ‌దిలి సినిమాల వైపు వ‌డి వ‌డిగా రావ‌డం.. ఇక్క‌డ వ‌రుస‌గా ఒక‌టి రెండు మూడు నాలుగు అంటూ సినిమాల మీద సినిమాలు చేసి త‌న సినీ మార్కెట్‌ను మ‌రింత పెంచుకునేలా అడుగులు వేయ‌డం చేస్తున్నారు..

అయితే ఇక్క‌డే చిరంజీవి లెక్క త‌ప్పుతోంది.. వరుస ఎదురు దెబ్బ‌లు ప‌డుతున్నాయ్.,.
చిన్నఃచిన్న కుర్రాళ్లు పాన్ ఇండియా లెవ‌ల్లో రికార్డుల మీద రికార్డులు తిర‌గ‌రాస్తుంటే..
మ‌రీ మ‌ఖ్యంగా త‌మ మెగా కాంపౌండ్ నుంచి రీసెంట్‌గా ‘పుష్ప’ ఫ‌స్టాఫ్‌లోనే ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తుంటే..
పాపం చిరంజీవి బాక్సాఫీస్ ముందు ఒక ‘సైరా’ మ‌రో ‘ఆచార్య’ అంటూ డిజాస్ట‌ర్ల‌తో చ‌తికిలప‌డుతున్నారు..
దీంతో ఇదో ఆవేద‌న మ‌న గ్యాంగ్‌లీడ‌ర్ గుండెల్లో గూడు క‌ట్టుకుంటోంది..
ఇటు త‌న సినిమా ప‌రంగా అటు త‌న త‌మ్ముడి పార్టీ ప‌రంగా.. ఏదో ఒక‌టి చేసి.. ఫామ్‌లోకి రావాల‌న్న‌ది ఒక ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది..
అంటే ఒక తూటా రెండు టార్గెట్లు అన్న‌ట్టు..

ఇన్నేసి పే లోడ్ల‌తో చిరంజీవి సినిమాలు ఆపసోపాలు ప‌డుతూ.. నింగికెగ‌స్తున్నాయ్
చిరంజీవి రాజ‌కీయాల్లోకి రాక ముందు త‌న చిత్రాలు కేవ‌లం వినోదం కోసం మాత్ర‌మే అన్న‌ట్టు తీసేవారు..
సందేశాత్మ‌కాలు త‌న‌కు అక్క‌ర్లేదంటూ తెగేసి చెప్పేవారు..

అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న విజ‌య ప‌రంప‌ర స‌జావుగానే సాగుతూ వ‌చ్చింది..
కానీ ‘ఠాగూర్’, ‘స్టాలిన్’ వంటి సినిమాల‌తో ఆయ‌న మ‌రేదో ప్రేక్ష‌కుల‌కు చాటి చెప్పాల‌నుకుంటున్నారు.
అదొక ద‌శ‌.. త‌ర్వాత రాజ‌కీయాల్లోకి రావ‌డం.. అక్క‌డ క‌నీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోక పోవ‌డంతో
కొన్నాళ్ల పాటు వేచి చూసి.. తిరిగి వెనుదిరిగిపోవ‌డం.

ఇంత‌లో డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ మరణం, రాష్ట్ర విభ‌జ‌న‌.. వంటి కొన్ని ఘ‌ట‌న‌లు రాజ‌కీయంగా చిరంజీవి తొంద‌ర‌బాటు త‌నాన్ని ఎత్తి చూపాయ్.
మ‌రికొన్నాళ్ల పాటు వేచి ఉంటే బావుండేద‌న్న మాట వినిపించింది.
ఈ లోగా త‌మ్ముడు వ‌ద్ద‌న్నా విన‌కుండా జ‌న‌సేన ప్రారంభించ‌డం, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ప‌రోక్షంగా రాచ‌బాట‌లు ప‌ర‌చ‌డం, ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొని బొక్క‌బోర్లా ప‌డ్డం..

ఇప్పుడు ఎలాగైనా స‌రే రాజ‌కీయంగా త‌మ కుటుంబం ఫిట్టే అని నిరూపించుకోవ‌డంలో భాగంగా
తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

క‌నీసం మా ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్ధిగా ఇంత ప్ర‌చారం చేసినా ప్ర‌కాష్ రాజ్ ను గెలిపించుకోలేక పోయాం..
ఏమిమీ దుస్థితి అన్న‌ది మెగా ఫ్యామిలీని గ‌త కొంత కాలంగా వేధిస్తూ వ‌స్తోంది.
వీట‌న్నిటికీ ఫుల్ స్టాప్ ప‌డాలంటే.. ఖ‌చ్చిత‌మైన రాజ‌కీయ రాణింపు అవ‌స‌రం..
అందుకే జ‌గ‌న‌న్న‌తో భేటీలు, మోదీతో క‌ల‌సి వేదిక పంచుకోడాలు..
టికెట్ల కొట్లాట‌లో వంగి వంగి దండాలు పెట్ట‌డాలు..

ఇవ‌న్నీ క‌ల‌సి.. మెగా ప్రాముఖ్య‌త‌ను మ‌రింత పెంచాల‌నే తాప‌త్రాయ‌న్ని వ్య‌క్తం చేస్తున్నాయ్.
నిజానికి చిరంజీవిలో ఎలాంటి రాజ‌కీయ ఆశ‌యాలు లేకుంటే..
‘లూసిఫ‌ర్’ లాంటి పొలిటిక‌ల్ స్టోరీల‌తో ముందుకు రావ‌ల్సిన అవ‌స‌రం లేదు.
క‌మ‌ల్ హాస‌న్ ఒక విక్రం సినిమా చూడండి,

కోయంబ‌త్తూరులో ఒక మ‌హిళ చేతిలో ఓడినా స‌రే..
దాని తాలూకూ ఫ్ర‌స్ట్రేష‌న్ ఎక్క‌డా త‌న సినిమాలో చూప‌కుండా
పైపెచ్చు ఈ టైంలో వీరులేమంటారో తెలుసా ప‌దా చూసుకుటాం అంటూ
ధైర్య‌వ‌చ‌నాలు ప‌లుకుతూ.. దూసుకొచ్చేశారు

చిరంజీవి సినిమా కూడా స‌రిగ్గా ఇలాగే ఉండాల్సింది..
ఎలాంటి రెఫ‌రెన్సుల్లేకుండా కేవ‌లం సినిమా సినిమాలాగా రావ‌ల్సింది.. కానీ ఎందుక‌నో చిరంజీవి తెలిసీ తెలియ‌క రాజ‌కీయ ర‌ణ‌గొణ ధ్వ‌నులు చేస్తూనే వ‌స్తున్నారు..
మ‌రి చూడాలి గాడ్ ఫాద‌ర్ పొలిటిక‌ల్‌గా ఇంత ర‌చ్చ చేస్తున్న త‌రుణంలో
బాక్సాఫీసు ముందు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రిస్తుందో తెలియాల్సి ఉంది.
అంతా ద‌ర్శ‌కుడి ద‌య‌- ప్రేక్ష‌కుల ప్రాప్తం చిరు అదృష్టం!

– ఆదినారాయణ సర్వేపల్లి, సీనియర్ జర్నలిస్ట్