టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనడానికి ముందు ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ బయటపిడింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కొవిడ్ పరీక్ష చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత నాలుగైదు రోజులుల్లో నన్ను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. చిరంజీవి తమ్ముడు నాగబాబుతోపాటు యాంగ్రీ హీరో రాజశేఖర్ తదితరులు కరోనా బారిన పడ్డం తెలిసిందే. దీంతో సినిమా షూటింగులపై మళ్లీ సందిగ్ధం నెలకొంది.