జూనియర్ ఎన్టీఆర్‌‌కు కరోనా... - MicTv.in - Telugu News
mictv telugu

జూనియర్ ఎన్టీఆర్‌‌కు కరోనా…

May 10, 2021

ntr02

టాలీవుడ్‌లో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. షూటింగులు ఆపకపోవడంతో పలువురు నటీనటులు వైరస్ బారిన పడుతున్నారు. స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడ కరోనా పాజిటివ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు.

‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంత ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నాతోపాటు నా కుటుంబ సభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నాం. అన్ని రకాల కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాం. ఇటీవల నాతో సన్నిహితంగా మలసిన వాళ్లందూ కోవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను..’ అని ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌ తదితరులకు కరోనా రావడం, కోలుకోవడం తెలిసిందే. నాలుగైదు నెలల కిందట కరోనా ఉధృతి తగ్గడంతో షూటింగ్ లు పూర్తి స్థాయిలో మొదయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగులో జూ. ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాధి సోకింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత కాలం వాయిదే పడే అకాశముంది.

ntr02