Home > Featured > తొలిసారి షర్ట్ లేకుండా మహేశ్ బాబు.. 

తొలిసారి షర్ట్ లేకుండా మహేశ్ బాబు.. 

Tollywood hero Mahesh babu goes shirtless

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు సినిమాల్లో ఎంత ఇరగదీస్తాడో కొన్ని విషయాల్లో అంత రిజర్వుడుగా ఉంటారు. ముఖ్యంగా బాడీని చూపించడానికి అసలు ఇష్టపడడు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో షర్ట్ లేకుండా కనిపించడు. కావాలంటే టీషర్టుపై చొక్కా వేసుకుని కూడా కనిపిస్తాడు. కథ ప్రకారం కండలు చూపించాల్సి వస్తుందని కొన్ని సినిమాలు కూడా వదులుకున్నాడు. ఇంత సిగ్గేంటి బాబూ అని అభిమానులు విసుక్కున్నా ఇట్స్ మై లైఫ్ అనేస్తాడు.

అలాంటి మహేశ్ బాబు తొలిసారిగా చొక్కా లేకుండా కనిపించాడు. సినిమాల కోసం కాదులెండి, ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో. కూతురు సితారతో కలిసి పూల్లో సందడి చేస్తున్న హీరో ఫొటోను భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులోనూ ప్రిన్స్ పూర్తిగా కాకుండా ఛాదీ వరకు మాత్రమే నగ్నంగా కనిపిస్తున్నాడు. అభిమానులు దాన్ని వైరల్ చేశారు.

Updated : 18 May 2020 11:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top