మహేశ్ బాబు రూ. కోటి విరాళం.. మనం గెలుస్తాం..   - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ బాబు రూ. కోటి విరాళం.. మనం గెలుస్తాం..  

March 26, 2020

Tollywood hero Mahesh babu one crore donation 

కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి టాలీవుడ్ స్టార్లు ముందుకొస్తున్నారు. తొలుత నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున అందించగా మిగతా హీరోలు, దర్శకులు, నటులు కూడా తమ వంత కర్తవ్యంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. రాంచరణ్ రూ. 70 లక్షలు ఇచ్చారు. చాక్లెట్ బాయ్ మహేశ్ బాబు ఏకంగా రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దాంతోపాటు కరోనా రాకూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ‘శ్రీమంతుడు’ కోరాడు. బాధ్యతగా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పనులపై మాత్రమే బయటికి వెళ్లాలని కోరారు. అందరూ విరాళాలు ఇవ్వాలని కోరిన మహేశ్ 21 రోజు లాక్‌డౌన్ పాటించాలని సూచించారు. ‘అందరం కలసికట్టుగా ప్రతి ఒక్కర్నీ కాపాడుకుందా. మానవత్వం గెలుస్తుంది. ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. అంతవరకు ఇళ్లలోనే ఉండండి.. ’ అని కోరాడు.