వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం.. నుజ్జునుజ్జుయిన బండ్లు - MicTv.in - Telugu News
mictv telugu

వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం.. నుజ్జునుజ్జుయిన బండ్లు

June 12, 2019

టాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం జరిగింది. మరో కారు ఆయన కారును బలంగా ఢీకొట్టింది. అయితే వరుణ్ అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. వరుణ్, మరికొందరు నటులు ‘వాాల్మీకి’ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నటులకు ముప్పు తప్పింది.  ఈ సంఘటనలో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వరుణ్‌ తేజ్‌, ఇతర నటులు మరో కారులో బెంగళూరు వెళ్లిపోయారు. వరుణ్ కారును ఢీకొట్టిన వాహనంలోని యువకులు మద్యం తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.