Tollywood heroes staying in a rented house
mictv telugu

ఈ స్టార్ హీరోలు సొంత విల్లాలు వదిలి అద్దె ఇంట్లో ఉంటున్నారు

October 24, 2022

సొంతిల్లు ఉండాలనేది ప్రతీ వ్యక్తి కల. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సొంతింటి కోసం తమ ఉద్యోగ జీవితాన్ని ధారపోస్తారు. అప్పటివరకు అద్దె ఇంట్లో ఉండి ఎప్పటికైనా సొంతింటి కల సాకారం చేసుకుంటామని కలలు కంటూంటారు. కానీ, తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉంటూ, సొంతంగా పెద్ద భవనాలు, విల్లాలు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ, వీరి చర్య మాత్రం చర్చనీయాంశంగా మారింది. విలాసవంతమైన ఇంద్రభవనాలు వదిలి చిన్న చిన్నింట్లో అద్దెకుంటున్న వారి లిస్టు చూద్దాం.

1. మహేశ్ బాబు : నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో అతిపెద్ద భవనం ఉంది. కానీ, మహేశ్ అందులో ఉండడం లేదు. నగరంలోనే ఓ త్రిబుల్ బెడ్రూం అపార్టుమెంటులో ఉంటున్నారు. ఆమె సోదరి మంజుల కూడా మహేశ్ ఎదురింట్లో నివసిస్తున్నారు.
2. రాజమౌళి : తన చిత్రాలతో టాలీవుడ్ స్థాయిని పెంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి పెళ్లయినప్పటి నుంచి మణికొండలో నివసిస్తున్నారు. గతంలో ఓ విలాసమైన విల్లాలో ఉండేవారు కానీ, తర్వాత దానిని అద్దెకిచ్చి త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో ఉంటున్నారు.
3. నాగచైతన్య : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య అబిడ్స్‌ మాల్ సమీపంలో ఉండే ఓ సాధారణ ఫ్లాట్‌లో ఉంటున్నారు. తన రెండో సినిమా నుంచే అక్కడ ఉంటున్న నాగచైతన్య.. సమంతతో పెళ్లయిన తర్వాత కూడా అక్కడే నివాసమున్నారు. తర్వాత ఖరీదైన ఫ్లాట్‌లోకి మారారని టాక్. కానీ విడాకుల తర్వాత చైతన్య మళ్లీ అక్కడికి వెళ్లిపోయాడంట. అతని తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందనే సెంటిమెంటుతోనే నాగచైతన్య అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడని సమాచారం.
4. జగపతిబాబు : లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు నగరంలోని అపోలో ఆస్పత్రి వద్ద పెద్ద భవనం ఉంది. కానీ, అక్కడ కాకుండా కూకట్ పల్లిలోని ఓ ఫ్లాటులో నివాసముంటున్నారు.