జార్జిరెడ్డిపై అభినందనల వెల్లువ.. హీరోల ట్వీట్లు - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డిపై అభినందనల వెల్లువ.. హీరోల ట్వీట్లు

November 21, 2019

ఉస్మానియా వర్సిీ విద్యార్థి, ఉద్యమ విప్లవ కెరటం జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన ‘జార్జిరెడ్డి’ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలా మంది ఆయన అభిమాన విద్యార్థులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ట్రైలర్‌కు విశేషం స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి కూడా చిత్ర యూనిట్‌కు మంచి సపోర్ట్ లభిస్తోంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సినిమాపై అభినందనలు కురిపిస్తున్నారు. 

ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు సినిమా ట్రైలర్ గురించి మట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. బయోపిక్ అంటే ఇలా తీయాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి మూవీలోని  ‘అడుగు అడుగు’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. తాజాగా యంగ్ హీరోస్ కూడా జార్జిరెడ్డి స్పూర్తితో తీసిన సినిమాకు తమ వంతు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మాతలు అన్నపరెడ్డి  అప్పిరెడ్డి,సంజయ్ రెడ్డి,దామురెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, విశ్వక్ సేన్, పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పెద్ద హిట్ కావాలంటూ ఆకాంక్షించారు. 5 దశాబ్దాల కిందట జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థుల్లో రగిలించిన చైతన్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపే సినిమా యూత్‌కు మంచి మెసేజ్ ఇస్తుందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. టీఆర్ఎస్ తరుపున సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన తలసాని సాయికిరణ్ యాదవ్ కూడా అభినందనలు తెలిపారు.