టాలీవుడ్లో అగ్రనటికి కరోనా సోకింది. అందాలతార రకుల్ ప్రీత్‌సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నానని వెల్లడించింది.
‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే కోలుకొని సినిమా షూటింగ్లలో పాల్గొంటాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి.’ అని రకుల్ కోరింది.
రకుల్ తాజా చిత్రం ‘కొండపొలం’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. రాయలసీమ కథతో సాగే ఈ సినిమాలో ఆమె డీగ్లామరైజ్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. దీంతోపాటు ఆమె అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లలో బిజీగా మారింది. ఇండియన్2లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్లో రాజశేఖర్, చిరంజీవి, నాగబాబు తదితరులకు కరోనా సోకింది. ప్రస్తుతం చాలామంది కోలుకుని తిరిగి ముఖాలకు రంగులు వేసుకుంటున్నారు.