పద్మ శ్రీ అందుకున్న సిరివెన్నెల - MicTv.in - Telugu News
mictv telugu

పద్మ శ్రీ అందుకున్న సిరివెన్నెల

March 16, 2019

తన గేయాలతో ఎందరో శ్రోతలను అలరించిన ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈరోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రామ్‌నాద్ కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో జన్మించారు. సీతారామ శాస్త్రి మొదట టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా ఉంటూ పద్యాలు, గేయాలు రాసేవారు. ఒకసారి ఆయన రాసిన ‘గంగావతరణం’ అనే గేయాన్ని చదివిన కళాతపస్వీ కె.విశ్వనాథ్… సీతారామ శాస్త్రి రచనకు మంత్రముగ్దులయ్యారు. వెంటనే సీతారామ శాస్త్రిని పిలిపించుకొని ‘సిరివెన్నెల’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు.

Tollywood lyricist sirivennela sitarama shatri receive the padma shri from president tamnath kovith

సిరివెన్నెల చిత్రంలోని అన్ని పాట‌లు స్టీతారామ శాస్త్రి రచించగా, వాటికి భారీ ఆద‌ర‌ణ లభించడమే కాకుండా మొదటి సినిమాకే నంది పురస్కారం కూడా వరించింది. ఈ చిత్రం త‌ర్వాత నుండి చెంబోలు సీతారామ శాస్త్రి.. కాస్త సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారారు. అప్పటి నుంచి సిరివెన్నెల ఎన్నో సినిమాలకు గేయ రచన చేసి తెలుగు చిత్రసీమలో అగ్ర గేయ రచయితలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆలస్యమైనప్పటికీ.. సిరివెన్నెలకు పద్మశ్రీ వరించినందుకు తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.

Tollywood lyricist sirivennela sitarama shatri receive the padma shri from president tamnath kovith