లుక్కులతో  లక్కు సెట్  చేస్కోవడం అంటే ఇదే మరీ... - MicTv.in - Telugu News
mictv telugu

లుక్కులతో  లక్కు సెట్  చేస్కోవడం అంటే ఇదే మరీ…

September 5, 2017

అసలు కంటే కొసరంటే ఎంతో ఇష్టం. ఇచ్చిన అప్పు కంటే  దానీమిద వచ్చే మిత్తి అంటేనే ఇష్టం. అట్లాగే ఉన్నట్లుంది సిన్మవాళ్ల ముచ్చట  కూడా.  సిన్మా ఎట్లా ఉందనేది   కాద పాయింట్. టీజర్….. ఫస్ట్ లుక్ అదరిందా లేదా అనేదే పాయింట్. అందుకే సిన్మ నిర్మాణం కంటే టీజర్లు,  తొలి లుక్కులపైనే ఓ లుక్కేస్తున్నారు. రాజమౌళి ఈ తరహా ఈ ట్రెండ్   సెట్ చేశారు. బాహుబలి తర్వాత టీజర్లు, లుక్కులు అదిరి పోతున్నాయి. రెండేళ్ల కాలంలో వచ్చిన తెలుగు సిన్మాలు ముందుగా  టీజర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత సిన్మా థియేటర్లో అస్సలు స్టోరీ చూడాలని చెప్తున్నారు. నిముషం నరకు మించ కుండా ఇంకాస్త బావుంటే…. రెండునిముషాల వరకైనా ఫర్వలేదంటున్నారు.

ప్రభాస్, అల్లుఅర్జున సిన్మాలు, ఈ మధ్య వచ్చిన చిరు మూవీ, త్వరలో వస్తున్న సైరా నర్సింహారెడ్డి,  జూనియర్ రామారావు జై లవకుశ, తాజాగా రాంచరణ్ మూవీ రంగస్థలం… ఇట్లా అన్నీ సిన్మాలు  జనాల్లో  అటెన్షన్ పెంచుతున్నాయి. మూరిలీజ్ వరకు దాన్ని కంటిన్యూచేస్తున్నారు సిన్మవాళ్లు.

ఇంత సోషల్ మీడియా యుగంలో సిన్మాను బతికించుకోవాలంటే కొత్త దారులు వెతకాల్సిందే. అందుకే  లక్షలకు లక్షలు పోసి లక్షణంగా ఉన్నా నాలుగు సీన్లు పెడుతున్నారు. శేఖర్ కమ్ముల లాంటి వారు అయితే బాడ్ కావ్ అని తిట్టీ మరీ జనాలను  ఆకట్టుకుంటున్నారు.


రంగ స్థలం సిన్మాలో కూడా కాలి అందెలు, మెట్టెలు,  మట్టి కుండలు పెట్టి ఓ చిన్న లుక్ ఇచ్చారు. ఇక దాని గురించి జనాల్లో  బాగా  చర్చ జరిగిన తర్వాత మరో విజువల్ విడుదల చేస్తారు. ఇట్లా సిన్మా రిలీజ్ వరకు ఏ మాత్రం టెంపో గలీజ్ కాకుండా అంతా సెట్ చేసుకుంటారు. మన దగ్గర వస్తున్న సిన్మాలు అయితే బాలివుడ్ సిన్మాలను మించి ప్రమోట్ చేస్తున్నారు.

సిన్మా బాగున్నా లేకున్నా… తొలి వారం హౌజ్ ఫుల్ అయితే చాలు అన్నట్లు లుక్కులతో నే లక్కు చెక్ చేసుకుంటున్నారు మన తెలుగు డైరెక్టర్లు, హీరోలు. నిర్మాతలకు కాస్త బరువైనా కూడా భరించక తప్పడం లేదు. పోటీ ఉంది మరి. అందులోనూ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తే  ఈ సిన్మాకు కాక పోయినా మరో సిన్మాకు అయినా ఆ నేమ్  పనికొస్తందనే ఆలోచన కూడా ఉన్నట్లుంది.

సిన్మా రిలీజ్ తర్వాత సక్సెస్ టూర్లు ఎట్లాగూ ఉంటాయి. ఆ తర్వాత ఓ రెండు వివాదాలు.. టీవీ డిబేట్లు… మాటకు మాటలు…. నిరసనలు… అరుపులు, కేకలు… వీటికి తోడు సోషల్ మీడియాలో ప్రచారాలు… అబ్బో ఎంతో ఉంటుంది. వీటి కంటే ముందే లుక్కులతో….. సగ మూవీ చూపిస్తున్నారు. చూడాలి మరి రంగ స్థలం ఎట్లా ఉంటుందో.