టాలీవుడ్‌లో కరోనా విషాదం.. ప్రముఖ నిర్మాత మరణం - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌లో కరోనా విషాదం.. ప్రముఖ నిర్మాత మరణం

July 4, 2020

vgnvgbn

టాలీవుడ్‌లో కరోనా పెను విషాదాన్ని నింపింది. ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు (64) వైరస్ కారణంగా చనిపోయారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన అతని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమను శోఖసంద్రంలో ముంచేసింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. టాలీవుడ్‌లో కరోనా కాటుకు ఓ వ్యక్తి మరణించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

కొన్ని రోజుల క్రితం రామారావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అతనికి పరీక్షలు చేయగా.. కరోనా అని తేలింది. వెంటనే అతనికి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా రంగంలో అనేక హిట్ సినిమాలను ఆయన రూపొందించారు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌లో నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం సినిమాలు తీసి విజయాలను అందుకున్నారు. కాగా, ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించే నటులు, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా వ్యాధి బారిన పడ్డారు. ఈ క్రమంలో రామారావు మరణం కూడా అందరిని కలిచివేసింది.