వ్యాపారంలోకి దిగనున్న సమంత..! - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాపారంలోకి దిగనున్న సమంత..!

August 4, 2017

హీరోయిన్లు సినిమాలతోనే కాకుండా బిజినెస్ లతో కూడా బాగానే సంపాందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తమన్నా గోల్డ్ జ్యూయలరీ బిజినెస్ చేస్తుండగా, రకుల్ జిమ్ బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు వారి దారిలోనె సమంత కూడా SVS partaners LPT అనే కంపెనీ ని స్థాపించనుంది.

అయితే ఈ కంపెనీ ఏ ఉత్పత్తుల కోసం, ఏ సేవల కోసం సంబందించినదో దాని పై ఇంకా క్లారిటీ గా చెప్పలేదు. ఈ కంపెనీ కోసం ఎన్నో కలలు కన్నానని, త్వరలోనే ఆ కలలని సాకారం చేసుకుంటానని చెప్పింది సమంత. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వొవెస్ పై 2017 కార్యక్రమం కోసం పలు ప్రమోషన్ చేస్తుంది. చేనేత కార్మికులకు అండగా నిలబడుతూ వారి కోసం అనేక కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మూవీలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రంగస్థలం 1985, రాజుగారి గది 2 , మహానటి సినిమాలలో నటిస్తుంది సమంత.