నో కామెడీ ప్లీజ్.. నేను చావలేదు: సునీల్ - MicTv.in - Telugu News
mictv telugu

నో కామెడీ ప్లీజ్.. నేను చావలేదు: సునీల్

March 15, 2019

రేటింగుల కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలను  భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెయన్ కమ్ హీరో సునీల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఈ రోజు ఉదయం నుంచి పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సునీల్ ఫోన్‌కు కాల్స్ మీద కాల్స్ చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన వెంటనే తనకేం కాలేదని, క్షేమంగా ఉన్నానని ట్వీట్ చేశాడు.

‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీనటుడు సునీల్ దుర్మరణం పాలయ్యాడు’ అని శుక్రవారం ఉదయం ఓ యూట్యూబ్ చానెల్  వార్తను వదిలింది. కొద్ది సేపటికే ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం పాకింది. సునీల్ మరణించాడని బాధపడ్డారు అభిమానులు. అఖరికి అసలు విషయం తెలుసుకుని, వార్త ప్రసారం చేసిన చానెల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై స్పందించిన సునీల్ ‘ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మకండి. ఇలాంటి వార్తలు రాసి.. లేనిపోని భయాలు పుట్టించకండి’ అంటూ మీడియాను కోరాడు.

ఏదేమైనా ఈ రోజుల్లో కొందరు వాళ్ల టీఆర్పీ రేటింగ్‌లు, చానెళ్ల ప్రమోటింగ్‌ కోసం బతికున్నవాళ్లని చనిపోయారని ప్రసారం చేయడం బాధాకరం. అలాంటి వారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని పులువురు కోరుతున్నారు.