హీరోగా వివి వినాయక్ తెరంగేట్రం! - MicTv.in - Telugu News
mictv telugu

హీరోగా వివి వినాయక్ తెరంగేట్రం!

May 14, 2019

ఆది వంటి సూపర్ హిట్ సినిమాతో ఎన్టీఆర్‌ని స్టార్ హీరోని చేసిన దర్శకుడు వీవీ వినాయక్ త్వరలో హీరోగా అవతారం ఎత్తనున్నారనే వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది. అభిమానులకు ఎంతో ఆశ్చర్యం కలిగించిన ఈ వార్త త్వరలోనే నిజం కాబోతోందట. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్’ సినిమాలో ఓ గుర్తుండిపోయే పాత్రను పోషించిన ఈ దర్శకుడు, ఇప్పుడు సోలో హీరోగా పరిచయం కాబోతున్నాడట.

ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటం గమనార్హం. శరభ చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్‌.నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులై లేదా ఆగష్టు మాసంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 2018లో సాయిధరమ్ తేజ్ నటించిన ‘ఇంటెలిజెంట్‌’ తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదన్న సంగతి తెలిసిందే.