థాంక్స్ సంతోష్ గారు..మొక్కలు నాటిన మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

థాంక్స్ సంతోష్ గారు..మొక్కలు నాటిన మహేశ్ బాబు

August 9, 2020

No more Toll In Idukki Landslide Rises To 27......

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఎంతగానో సక్సెస్ అవుతోంది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున ఈ ఛాలెంజ్ లో స్వచ్చందంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అలాగే తమ స్నేహితులను ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేస్తూ వారితో కూడా మొక్కలు నాటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. మహేష్ మొక్కలు నాటిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

‘నా పుట్టినరోజును ఇంతకంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోలేనేమో! అందుకే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాను. ఈ చాలెంజ్ స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ నటుడు విజయ్, శృతి హాసన్ లను కోరుతున్నాను. ఈ చాలెంజ్ ను ఎల్లలు దాటించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం.’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.