విజయవాడలో సందడి చేసిన మహేష్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో సందడి చేసిన మహేష్ బాబు

October 13, 2019

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆదివారం విజయవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులో కొత్తగా ఏర్పాటుచేసిన భీమ జ్యువెల్లర్స్ షోరూంను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటి షోరూంను ఏర్పాటు చేసిన భీమ జ్యువెల్లర్స్‌ యాజమాన్యానికి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. 

mahesh babu.

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12న విడుదల కాబోతున్న తన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. మహేశ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.