Tollywood tv anchor Rahsmi attiutde hero nandu slams on bomma black bluster
mictv telugu

రష్మీ ఫోనెత్తదు, అహంకారం ఎక్కువ.. గీతా మాధురి భర్త సీరియస్

October 18, 2022

జబర్దస్త్ యాంకర్ రష్మీ సినిమాల కంటే టీవీ షోలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది. అయితే అడపాదడపా నటిస్తున్నా యాంకర్ అనసూయలా సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అప్పుడెప్పుడో ‘గుంటూరు టాకీస్‌’తో వచ్చిన క్రేజ్‌ను కొనసాగించలేకపోతోంది. అయితే టీవీషోలతో బిజీ బిజీగా ఉన్న రష్మీ రెండేళ్ల క్రితం హీరో నందుతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. కరోనా నుండి ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. మంచి బ్రేక్ కోసం చూస్తున్న నందు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రస్తుతం విడుదల కానుంది. ఈ సినిమాలో నందు మాస్ లుక్స్‌కి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక యాంకర్ రష్మీ రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది వరకు వదిలిన టీజర్, పాటలు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. దీనికి తోడు గత నెల రోజులుగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెగ ప్రమోట్ చేస్తున్నాడు నందు.

సరిగ్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వారం ముందు ‘మా ‘బీబీ’ని పరిచయం చేస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు. బీబీ అంటే అందరు హీరో నందు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నాడా అని అనుకున్నారు. కానీ బీబీ అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అని లేటెస్ట్‌గా ప్రకటించాడు. అయితే మా సినిమాలో టాప్ యాంకర్ అని పేరున్న రష్మీ హీరోయిన్‌గా చేసిందని.. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ కోసం సహకరించటం లేదన్నాడు. ‘ఫోన్ చేస్తే ఎత్తదు, ఆమెకు అహంకారం ఎక్కువ. ప్రమోషన్లకు అస్సలు రావడం లేదు’ అని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఎందుకు సినిమాకు ప్రమోషన్స్ చేయటం లేదని నిలదీశారు. అయితే నందు అండ్ టీమ్‌కి రష్మీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘ నా ఇష్టం. నేను రాను. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’ అని తేల్చేసింది. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ల కోసం చేస్తోన్న స్టంట్లే అని అర్థమవుతూనే ఉంది. ఇక చివరకు అంతా కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను ప్రమోట్ చేశారు. నవంబర్ 4న రాబోతోందంటూ రష్మీ సంబరపడిపోయింది.