Tollywood young actor nagashowrya hospitalized
mictv telugu

నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

November 14, 2022

టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఓ సినిమా షూటింగులో పాల్గొంటున్న ఆయన ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యలు చెప్పారు. తీవ్రమైన వ్యాయామం వల్లే ఆయన అనారోగ్యానానికి గురైనట్లు సమాచారం. సినిమాకు తగ్గట్టు సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా తక్కువగా తింటున్నారని, దీంతో పోషకాలు అందక అస్వస్థతకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సీనియర్ నటుడు కృష్ణ ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉండడం మరోవైపు నాగశౌర్య అస్వస్థతకు గురికావడంతో సినీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఎస్‌.ఎస్‌.అరుణాచ‌లం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. నాగశౌర్య పెళ్లి ఈ నెల బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో జరగనుంది. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లాడనున్నారు.