డ్రగ్స్ మత్తులో జోగుతోన్న ఆ ముగ్గురు హీరోలెవరు..? - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ మత్తులో జోగుతోన్న ఆ ముగ్గురు హీరోలెవరు..?

July 12, 2017

 

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ చిత్తవుతోంది. సిటీ లో ఎక్కడ డ్రగ్స్ బయటపడిన సినీ పరిశ్రమకు లింకులు ఉన్నాయి. ఈ సారి ఏకంగా ముగ్గురు యువహీరోలు మత్తులో జోగుతున్నారు. వీరితో నలుగురు డైరెక్టర్లు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్‌ మాస్టర్‌ ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరు..?నోటీసులు ఇచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ నెక్ట్స్ స్టెప్ ఏంటీ..?లోతుగా దర్యాప్తు చేపట్టి సరఫరాదారులను.. వారి వెనకున్న వారిని పట్టుకుని దీనికి ముగింపు పలుకుతుందా..?

హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ బుధవారం నోటీసులు ఇచ్చింది. మొత్తం 10 మందికి నోటీసులు జారీచేసిన ఎక్సైజ్‌శాఖ ఆరు రోజుల్లోగా వారు విచారణకు హాజరు కావాలని సూచించింది. నోటీసులు జారీ అయిన వారిలో ముగ్గురు యువ హీరోలతోపాటు దర్శకులు , నిర్మాతలు ఉన్నారు.

డ్రగ్స్‌ మాఫియాతో సినీ పరిశ్రమకు లింకులు ఉన్నాయనే ఆరోపణలపై ‘మా’స్పందించింది. డ్రగ్స్‌ తీసుకొనే కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని సినీ పెద్దలు అన్నారు. అలాంటి వాళ్లకు పరిశ్రమ సహకరించదని స్పష్టం చేశారు. తమకు సామాజిక బాధ్యత ఉందని, డ్రగ్స్‌ వాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించినా శిక్షార్హులేనని నిర్మాత సురేశ్‌బాబు చెప్పారు.

పిల్లి క‌ళ్ళు మూసుకొని పాలు తాగుతున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే అది క‌రెక్ట్ కాదు, మీరు చేస్తున్న ప్ర‌తి ఒక్క అంశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. డ్రగ్స్ ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? తీసుకున్నారన్న ప్రతి రికార్డు కూడా పోలీసుల దగ్గర ఉందని స్పష్టం చేశారు. కేవలం భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు 15 మందిని ఉపేక్షిస్తున్నారన్నారు. లోతుగా దర్యాప్తు చేపట్టి సరఫరాదారులను.. వారి వెనకున్న వారిని పట్టుకుని దీనికి ముగింపు పలకాలని సినీ పెద్దలు కోరుతున్నారు.

ఇంకేందుకు ఆలస్యం సీఎం కేసీఆర్ సార్…జర మత్తులో జోగుతోన్న సినీ పరిశ్రమపై ఓ కన్నేయండి. కలుగులో దాక్కున్నా బయటకు లాగాలని ఆర్డరేయండి..అప్పుడుగానీ మత్తులో జోగుతున్న హీరోలు , డైరెక్టర్లు, నిర్మాతలు సక్కగా అవుతున్నారు. వదలొద్దు..ఎవర్నీ వదలొద్దు సారూ…