అవకాశాలు లేనోళ్లే డ్రగ్స్ దందాలోకి...! - MicTv.in - Telugu News
mictv telugu

అవకాశాలు లేనోళ్లే డ్రగ్స్ దందాలోకి…!

July 14, 2017

హీరోలుగా ఒకటి రెండు సినిమాలే..ఎంత కొంత పేరు…ఆ తర్వాత నో చాన్సెస్.. అప్పుడు ఏం చేసి రాయల్ గా బతకాలి. కొందరు సినీ ఫీల్డ్ ను వదిలేసి బిజినెస్ లో సెటిల్ అయితే …మరికొందరు అవకాశాలు లేకపోయిన ఆశలను చంపుకోలేకపోతున్నారు. ఎలాగైనా టాలీవుడ్ లో, స్టార్స్ తో టచ్ లో ఉండాలనుకుంటున్నారు.చాన్స్ లు రాక పైసా ఆదాయం లేకపాయె..అప్పుడు ఏం చేయాలి..వాళ్లకు ఒకే దారి కనిపించింది. దొంగదారి డ్రగ్స్ దందా దారి.గ్రాములతో కోట్ల బిజినెస్. ఈ దందాతో ఒక్క సినిమా లేకపోయినా బిందాస్ గా రాయల్ లైఫ్ గడిపేస్తున్నారు.సినీ జనుల్ని నిషాలో ముంచుతూ కోట్లకు కోట్లు సంపాదించారు.

సినిమా వాళ్లు ఎవరు డ్రగ్స్ తీసుకోని పతీతులు కారు. ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ వాసిన చూసినోళ్లే.అంటే అన్నారు అంటారు గానీ ఇది బహిరంగ రహస్యం.. కాకపోతే దొరికినోడే దొంగ.పైకి వేదాలు వల్లిస్తున్న పెద్దల పుత్ర రత్నాలు కూడా నిషాచారులే..ఎప్పటికి వారి పేర్లు బయటపడకపోవచ్చు గానీ ఫిల్మ్ నగర్ గుసగుసల్లో మాత్రం ఇది పచ్చినిజం. లేట్ నైట్ పార్టీ, ఫారిన్ కల్చర్..షూటింగ్ ఒత్తిళ్లే డ్రగ్స్ వైపు నడిపిస్తున్నాయి. ఇది కాదనలేని కఠోర వాస్తవం.ఎప్పుడు డ్రగ్స్ కేసులు బయటపడినా మేనేజ్ చేశారు..కానీ ఈసారి ఎలాగో లెక్క తప్పింది..రచ్చ రచ్చ అయి కూర్చుంది.

హీరో తరుణ్..పదేళ్లుగా ఒక్క సినిమా లేదు. నువ్వే కావాలి. నువ్వు లేక నేను సినిమాలే హిట్. ఆ తర్వాత వచ్చినవి అన్ని ఫటే..అయినా దిల్ దారుగా..రాయల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఫిల్మ్ నగర్ చుట్టు తిరుగుతున్నాడు. పేరుకు పబ్ బిజినెస్ అయినా లోపల జరిగేదంతా నిషా దందాయే.ఇన్నాళ్లుగా మత్తులో జోగుతూ..దింపుతూ..ఇలా బుక్కయ్యాడు..

నవదీప్ చేసింది మూడు నాలుగు సినిమాలే ..ఏ ఒక్కటి సరిగ్గా ఆడలేదు..విలన్ గా టర్న్ తీసుకున్నా..క్లిక్ కాలేదు..ఇతను దందాలోకి దూకేశాడు.కొకైన్ ముఠాలతో జత కట్టాడు..డ్రగ్గిస్ట్ గా , సప్లయిర్ గా రియల్ క్యారెక్టర్ లోకి ఎంటరయ్యాడు..

ముమైత్ ఖాన్..ఇప్పటికింకా నా వయస్సు పదహారు అంటూ ఓ ఊపేసిన తర్వాత అవకాశాల్లేవ్..ఉన్నా అరకొరయే..ఇంటాబయటా టెన్షన్స్ ..తట్టుకోని నిలబడాలంటే నిషా మత్తులోకి దిగాల్సిందే..అలా దిగినట్టుంది ఈ అమ్మడు..

రవితేజ…లేట్ గా క్లిక్ అయిన మాస్ హీరో. వయస్సు పైబడింది. ఎనర్జిటిక్ గా కనిపించాలంటే అవి కంపల్సరీ…అసలే తమ్ముళ్లది డ్రగ్స్ దందానే కదా..గతంలో చిక్కారు కూడా…మొన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భరత్ ఇందులో ఒకడే..

చార్మింగ్ చార్మికి కూడా సినిమాలు లేవు. ప్రొడక్షన్ లోకి వెళ్లిన కలిసిరాలేదు..ఐటెమ్స్ సాంగ్స్ తో నెట్టుకురాలే..చివరకిలా డ్రగ్స్ లిస్టులోకి ఎక్కింది.

ఇక పూరి జగన్నాథ్ చేతిలో సినిమాలు ఉన్నా. రెండు, మూడేళ్ల నుంచి అన్ని ప్లాపులే..బాధ తట్టుకోవాలంటే ఏం చేయాలని చార్మిని అడిగినట్టు ఉన్నాడు.. గమ్మత్తుగా మంత్ర మత్తులోకి దింపినట్టుంది. లేదా ఈయనే ఇడియట్ కదా దించేసి ఉంటాడు లే..

వీళ్లే కాదు…బయటపడని చాలా మంది స్టార్ లు కో స్టార్ లు డ్రగ్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మానుకోండి..లేదంటే పరువు పోయిన పని పోయి బజారుపడాల్సి వస్తోంది..బీ అలెర్ట్ సినీ స్టార్స్